ల్యాండ్‌మార్క్‌ మూవీ అవుతుంది

7 Apr, 2019 01:56 IST|Sakshi
మహేశ్‌బాబు, ‘దిల్‌’ రాజు, వంశీ పైడిపల్లి

– వంశీ పైడిపల్లి

‘‘మహేశ్‌బాబు లాంటి స్టార్‌ హీరో సినిమాలో ఉన్నప్పుడు కథను చెప్పాలనుకుంటున్న స్టయిల్‌లో చెబుతూనే ఆయన స్టార్‌డమ్‌ పక్కన పెట్టకుండా చేయాలి. కాబట్టి కాస్త సమయం పట్టింది. ‘ఊపిరి’ సినిమా సమయంలో మహేశ్‌గారికి ఈ ఐడియా చెప్పాను. 6 నెలల తర్వాత కథ చెప్పాను. ఈ కథను చెప్పే సమయంలో ‘మహర్షి’ ఆయన 25వ సినిమా అవుతుంది అని తెలియదు. అలా కుదిరింది. మహేశ్‌గారి కెరీర్‌లోనూ, మా అందరి కెరీర్లలోనూ ‘మహర్షి’ ల్యాండ్‌మార్క్‌ మూవీ అవుతుంది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు.

మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ శనివారం రిలీజైంది. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో మొదటి పాట రిలీజ్‌ చేసినప్పుడు ఇది ఫ్రెండ్‌షిప్‌ మూవీ అన్నారు. టీజర్‌ చూడగానే అభిప్రాయాలు మార్చుకున్నారు. ట్రైలర్, పాటలన్నీ రిలీజ్‌ అయిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటారు. వంశీ 5 సినిమాల్లో 4 నాతోనే చేశాడు. ఈ సినిమా మీద 3 ఏళ్లుగా వర్క్‌ చేస్తున్నాడు.

కంటెంట్‌ పరంగా, మేకింగ్‌ పరంగా అద్భుతమైన సినిమా ఇది. సినిమా చూశాక ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. మా కష్టాన్ని మే 9న ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ‘‘టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా మీద అందరం నమ్మకంగా ఉన్నాం. నిర్మాతల సహకారానికి థ్యాంక్స్‌. అడిగింది కాదనకుండా ఇచ్చారు. మహేశ్‌గారు నిజంగా డైరెక్టర్స్‌ యాక్టరే. రిషి పాత్రకు ఊపిరి పోశారు. ఆయన నమ్మకం, సపోర్ట్‌ కారణంగానే ఇంత మంచి సినిమా చేయగలిగాం. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరిస్తున్నాం. మరో పాట బ్యాలెన్స్‌ ఉంది. నరేశ్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. రాజుగారితో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు వంశీ పైడిపల్లి.

మరిన్ని వార్తలు