బిగ్‌బాస్‌-4: హోస్ట్‌గా మహేశ్‌ బాబు!

13 Mar, 2020 15:34 IST|Sakshi

భాషలతో సంబంధం లేకుండా టెలివిజన్‌లో దూసుకుపోతున్న షో ‘బిగ్‌బాస్‌’. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన సత్తా చూపిస్తోంది. ఇక తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకొని టాప్‌ పాపులారిటీని సంపాదించుకుంది. మొదటి సీజన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో సీజన్‌లో నాని వ్యాఖ్యాతగా తన సత్తా చాటాడు. ఇక మూడో సీజన్‌లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున అడుగుపెట్టి షోను మరింత రసవత్తరంగా మలిచాడు. దీంతో టీఆర్‌పీ రేటింగ్‌ అమాంతం పెరిగి నెంబర్‌ వన్‌ రియాల్టీ షోగా కీర్తి గడించింది. కాగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ కాబోతుంది. అయితే ఈ సీజన్‌లో ఎవరు వ్యాఖ్యాతగా చేయనున్నరనేది ఆసక్తికరంగా మారింది. (టీఆర్పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్‌ 3 గ్రాండ్‌ ఫినాలే)

(బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కోరిక నెరవేర్చిన నాగార్జున)

ఎన్టీఆర్‌ మరో‘సారీ’..
జూనియర్‌ ఎన్టీఆర్‌ను మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సిందిగా బిగ్‌బాగ్‌ నిర్మాతలు కోరినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఇందుకు తారక్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెరపై కనిపించడానికి ఈ సూపర్‌ స్టార్‌ ఆస​క్తిని కనబరుస్తున్నారు. బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా అలరించేందుకు మహేష్‌ సన్నద్ధమవుతన్నట్లు, అందులో భాగంగా ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాతలు ఎలాంటి అధికారిక సమాచారాన్ని ప్రకటించలేదు. అలాగే గత సీజన్ల కంటే సీజన్‌4 భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ 3ని,  బిగ్‌బాస్‌ 2కు జిరాక్స్‌ కాపీగా మలిచారన్న విమర్శలు రావడంతో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అందుకోసం షో ఫార్మాట్లను కూడా మార్చుతున్నట్లు సమాచారం. (ఈ ముగ్గురికీ విషెస్‌ చెప్పిన మహేశ్‌బాబు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు