నాకందిన బెస్ట్ గిఫ్ట్ తనే : మహేష్

24 Jan, 2017 15:44 IST|Sakshi
నాకందిన బెస్ట్ గిఫ్ట్ తనే : మహేష్

గతంలో తన సోషల్ మీడియా పేజ్లో ఎక్కువగా సినిమా విశేషాలను మాత్రమే షేర్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల కుటుంబ విషయాలను, తన ఆలోచనలను కూడా షేర్ చేస్తున్నాడు. ఫ్యామిలీ టూర్ విశేషాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజులకు సంబంధించిన పోస్టులు పెడుతూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు.

ఈ రోజు(మంగళ వారం) నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా తన కూతురు సితార ఫోటోను ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేసిన మహేష్, 'నాకు అందిన బెస్ట్ గిఫ్ట్ తనే, తనే నా గర్వం, తనే నా ఆనందం. మీరు కూడా మీ కూతుళ్లకు నాలాగే గర్వపడే తల్లి దండ్రులు కావాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరికొంత మంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పంధించారు.