మహేశ్‌ బాబు భావోద్వేగ ట్వీట్‌

26 Jan, 2020 17:09 IST|Sakshi

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు. (సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్‌ చెప్పనున్న మహేశ్‌!)

'మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత హీరోలకు సెల్యూట్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతున్నట్టుగా సూపర్‌స్టార్‌ పేర్కొన్నారు. లేడీ అమితాబ్‌ విజయశాంతి, చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా మహేశ్‌తో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్‌గా నటించిన విషయం తెలిసిందే.

(సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు