తాతకు బహుమతి

1 Jun, 2020 01:28 IST|Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ  మనవడు, గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా పరిచయం కాబోతున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు అశోక్‌. కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనకు ఓ బహుమతి అందించింది ఈ చిత్రబృందం. కృష్ణ సూపర్‌ హిట్‌ పాటల్లో ‘యమలీల’ సినిమాలోని ‘జుంబారే జుజుంబారే...’ పాట ఒకటి. ఇప్పుడు ఇదే పాటను రీమిక్స్‌ చేశారు ఆయన మనవడు గల్లా అశోక్‌. ఈ పాట టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. కృష్ణ స్టెప్స్‌ను అనుకరిస్తూ అశోక్‌ గల్లా ఈ రీమిక్స్‌కి స్టెప్స్‌ వేశారు. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. 50 శాతం షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమాకు టైటిల్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా