బోర్‌ కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా : మహేశ్‌

24 Feb, 2020 13:07 IST|Sakshi

మహేశ్​.. ఆ పేరులోనే ఓ మత్తుందబ్బా అంటారు అమ్మాయిలు. అవును మరి, అందానికి కేరాఫ్​ టాలీవుడ్​ ప్రిన్స్. ఈ రాజకుమారుడిని చూసేందుకు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా క్యూ కడుతుంటారు. ఆయన కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపిస్తారు. ఇక మహాశ్‌ కూడా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ నవ్వుతూ.. సరదాగా ఉంటారు.  సినిమాలో కూడా తనదైన పంచులతో నవ్విస్తుంటాడు. మహేశ్‌ కామెడీ చేశాడంటే పగలబడి నవ్వాల్సిందే. ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు.

(చదవండి : ప్లాన్‌ మారిందా?)

ఇక నిజ జీవితంలోనూ​ మహేశ్‌ బాబు కామెడీ పంచులు వేస్తూ సరదాగా ఉంటాడు. ఇటీవల ఓ ఎయిర్‌పోర్ట్‌లో తనను ఫోటో తీస్తున్న ఒక అభిమానిని తనదైన కామెడీ డైలాగ్‌తో నవ్వించేశాడు. ఎయిర్‌పోర్ట్‌లో నుంచి వస్తున్న మహేశ్‌ను ఒక అభిమాని కెమెరాలో ఫోటోలు తీస్తున్నాడు. మహేశ్‌ కారు దిగి నడిచి వస్తున్నంత సేపు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఇది గమనించిన మహేశ్‌.. ‘ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా’ అంటూ తనదైన కామెడీ డైలాగ్‌తో అతన్ని ఆపాడు. మహేశ్‌ మాటలకు అక్కడి సిబ్బందితో పాటు ఆ కెమెరామెన్‌ కూడా గొల్లున నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. మహేశ్‌బాబు త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించనున్నారు. 

మరిన్ని వార్తలు