‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’

30 Dec, 2019 19:46 IST|Sakshi

దేవిశ్రీ ప్రసాద్‌ అదిరే బీట్‌ ఇవ్వగా.. రామజోగయ్యశాస్త్రి పార్టీ సాంగ్‌కు కావాల్సిన లిరిక్స్‌ అందించగా.. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించగా.. శేఖర్‌ మాస్టర్‌ కొత్త స్టెప్పులు కంపోజ్‌ చేయగా.. మహేశ్‌-తమన్నాలు అదిరిపోయే డ్యాన్స్‌లతో పిచ్చెక్కించారు. ఇది కదా అసలు సిసలు మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ కోరుకునేది. న్యూఇయర్‌ కానుకగా మహేశ్‌ ఫ్యాన్స్‌కు కావాల్సిన ఫుల్‌  ధూంధాం సాంగ్‌ వచ్చేసింది. ఇక డాంగ్‌ డాంగ్‌ పార్టీ సాంగ్‌తో బ్యాంగ్‌ బ్యాంగ్‌ అంటూ న్యూఇయర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పడానికి రెడీ అవుతున్నారు సరిలేరు నీకెవ్వరు టీం.  

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబులు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతున్న ఈ చిత్రంపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్‌తో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లాయి. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి చివరి లిరికల్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుండగా.. తాజాగా ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. 

‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’, ‘లెట్స్‌ పార్టీ విత్‌ దిస్‌ సాంగ్‌.. గుర్తుండిపోవాలి లైఫ్‌ లాంగ్‌’, ‘వాటే స్కిన్‌ టోను.. నచ్చావే గ్లామర్‌ క్వీన్.. నిన్ను చూసి దిల్‌ మె గిర్రుమంది రొమాంటిక్‌ టోను’, ‘నువ్వు పక్కనున్న కిక్కు చాలు అదే చంద్రయాను’ అంటూ పాటలో వచ్చే లిరిక్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పాటతో సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇక దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకుంటోంది. మహేశ్‌ కూడా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా