ఇట్స్‌ ప్యాకప్‌ టైమ్‌..

18 Dec, 2019 19:39 IST|Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా విడుదలవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ నేటితో ముగిసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మూడు పాటలు విడుదలవ్వగా.. వాటికి విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా సాగుతున్నాయి. ‘జూలై 5న షూటింగ్‌ ప్రారంభించాం.. డిసెంబర్‌ 18న ముగించాం. ఈ సంక్రాంతి సినీ ప్రేమికులకు, అభిమానులకు జ్ఞాపకంగా మిగిలిపోతుంద’ని అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు.  

అలాగే నేడు నిర్మాత దిల్‌ రాజు జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవరు చిత్ర యూనిట్‌ ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా