‘ప్రేక్షకులూ.. సరిలేరు మీకెవ్వరూ..’

29 Feb, 2020 15:23 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజై అయిన ఈ చిత్రం మహేశ్‌ బాబు గత సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. లేడీ అమితాబ్‌ విజయశాంతి 13 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్‌కు చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్‌ ప్రోమోతో పాటు మైండ్‌ బ్లాక్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 50రోజులు అయిన సందర్భంగా హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు అనిల్‌ రావిపూడిలు ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత అనిల్‌ సుంకరలకు బిగ్‌ హగ్‌. అదే విధంగా చిత్రయూనిట్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌. అభిమానుల సపోర్ట్‌, ప్రేమ వర్ణించలేనిది’ అంటూ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు.  మరో మర్చిపోలేని సంక్రాంతి అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా చిత్రంలోని ఫవర్‌ ఫుల్‌ డైలాగ్‌లతో పాట సరిలేరు ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పేర్కొన్నాడు. హీరో మహేశ్‌తో పాటు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, అభిమానులకు అనిల్‌ రావిపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. 

 

చదవండి:
మణిశర్మ, తమన్‌.. ఇప్పుడు అనిరుద్‌?
ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా