అస్సలు కుదరలేదు : మహేష్‌ సోదరి

9 Jun, 2020 15:52 IST|Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ కూతురు, మహేష్‌బాబు సోదరిగా సుపరిచితురాలైన ఘట్టమనేని మంజుల ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ వీడియోల ద్వారా తనలోని మరో కోణాన్ని ఘట్టమనేని అభిమానులకు పరిచయం చేశారు మంజులా. గతంలో తను అనుభవించిన మనసిక వేదన గురించి, డిప్రెషన్‌తో పోరాడిన విషయాల గురించి తన ఛానల్‌లో మొదటి వీడియోగా పోస్ట్‌ చేశారు. అయిదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పదేళ్ల పాటు తను మానసిక ఒత్తిడికి గురైనట్లు, ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయట పడిందో వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడం, సుదీర్ఘ ధ్యానం ద్వారా ఈ సమస్య నుంచి  గట్టేక్కినట్లు మంజుల తెలిపారు. (నేను భయపడే ఏకైక వ్యక్తి నువ్వు: అనిల్‌ కపూర్‌)

‘ఇప్పటి వరకు మీకు సూపర్‌ స్టార్‌ కూతురుగా, మహేష్‌బాబు అక్కగా, నేషనల్‌ అవార్డు విన్నర్‌గా, బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ ‘పోకిరి’ ప్రోడ్యూసర్‌గా తెలుసు. ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చి, మీకు నన్ను దగ్గరగా చేశాయి. నేను నా జీవితంలో 30 సంవత్సరాలు వ్యక్తిగత  అభివృద్ధికి, 20 సంవత్సరాలు ధ్యాన సాధనకు అంకితం చేశాను. 10 వేల గంటల కంటే ఎక్కువగా యోగా ప్రాక్టిస్‌ చేశాను. నాన్న గారిని చూస్తూ పెరగడం వల్ల ఆయనలా గొప్ప యాక్టర్‌ అవ్వాలనుకున్నాను. ఆయనే నాకు ఆదర్శం‌. కృష్ణా గారి అమ్మాయి హీరోలతో నటించడం, రొమాన్స్‌ చేయడం నాన్న అభిమానులకు నచ్చలేదు. గొప్ప యాక్టర్‌ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఎంతో ప్రయత్నించాను. కానీ అస్సలు కుదరలేదు. చాలా బాధపడ్డాను. దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. (26 ఏళ్ల వయసులో ఆమెను ఇష్టపడ్డాను)

ఈ ఒత్తిడి నుంచి బయటకు రావాలని ఓ రోజు నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నాకు తెలియకుండానే గాఢమైన ధ్యానంలోకి వెళ్లిపోయాను. అప్పుడు నా ఆలోచనలు, మనసు, నమ్మకాలు నీకు పరిచయమయ్యాయి. ఎవరో చెప్పారని, ఎవరో ఆపారని కాదు. ఈ కమర్షియల్‌ సినిమాలకు కరెక్టు కాదు. నాకే అర్థమైంది. నిజమైన సంతోషం మనలోనే ఉంది అని. అప్పటి నుంచి ప్రతిక్షణం ప్రేమతో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఈ జర్నీలో ‘షో’ సినిమా ద్వారా నా యాక్టింగ్‌ కలను నిజం చేసుకోగలిగాను. నన్ను నేను మార్చుకున్నాను. ప్రశాంత వాతావరం ఏర్పరుచుకున్నాను.  నాన్నతో, అమ్మతో కబుర్లు చెప్పడం చేస్తున్నాను. నా కుటుంబంతో, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక నుంచి తన యూట్యూబ్‌ ఛానల్‌లో మరిని ఆసక్తికర విషయాల గురించి వివరించనున్నట్లు మంజుల పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు