కొరటాలకు మహేష్‌ స్పెషల్‌ విషెస్‌!

15 Jun, 2018 11:44 IST|Sakshi
కొరటాల శివ, మహేశ్‌ బాబు (ఫైల్‌ ఫొటో​)

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భరత్‌ అనే చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే నేడు ఈ చిత్ర దర్శకుడైన కొరటాల శివ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలియజేశాడు. ‘నా ప్రియమిత్రుడు, అద్భుత దర్శకుడు కోరటాల శివ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితాంతం ఇలానే నవ్వుతూ.. సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు.

భరత్‌ అనే నేను చిత్రంతో​ తెలుగులో అడుగుపెట్టిన కైరా అద్వానీ సైతం తన తొలి తెలుగు దర్శకుడికి విషెస్‌ తెలియజేసింది.‘‘ఎంతో ఉత్తమమైన, వినయపూర్వకమైన నా తొలి తెలుగు సినిమా దర్శకులు కొరటాల శివ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడి దీవేనలతో మరిన్ని అద్భుతమైన విజయాలు మీకు దక్కాలని కోరుకుంటున్నా. మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా’’ అని కైరా ట్వీట్‌ చేసింది. భరత్‌ అనే నేను చిత్రం టాలీవుడ్‌ సెన్సేషన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు