శ్రీమంతుడు @ 175

28 Jan, 2016 13:11 IST|Sakshi
శ్రీమంతుడు @ 175

ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లలో యాబై రోజులు  నడవటం లేదు. తొలి మూడు వారాల్లోనే ఎంత పెద్ద సినిమా అయినా ఢీలా పడిపోతుండటంతో 40, 50 రోజులకు మించి ఏ సినిమా థియేటర్లలో కనిపించే పరిస్థితి కనిపించటంలేదు. అలాంటిది శ్రీమంతుడు సినిమా మాత్రం ఏకంగా 175 రోజుల పాటు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది.

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బాహుబలి సినిమా తరువాత 100 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్ సృష్టించిన శ్రీమంతుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ లోని లక్ష్మణ్ థియేటర్లో ఈ రోజుకూ నాలుగు ఆటలు ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఈ రోజు ( జనవరి 28)తో 175 రోజులు పూర్తి చేసుకుంటుండటంతో అభిమానులు పండగచేసుకుంటున్నారు.

శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, కొరటాల మార్క్ టేకింగ్, డైలాగ్స్ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పటికే పలుమార్లు టీవీలో కూడా ప్రసారమయిన శ్రీమంతుడు, ఇప్పటికీ థియేటర్లో ప్రదర్శింపబడుతుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.