స్టూడెంట్‌ కృష్ణ

22 Jun, 2018 00:57 IST|Sakshi
మహేశ్‌బాబు

కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌లో పాఠాలు వింటున్నారు హీరో మహేశ్‌బాబు. కాలేజీ అయిపోగానే కథానాయిక పూజా హెగ్డేకు ప్రేమ పాఠాలు చెప్తున్నారట. ఇంతకీ.. మహేశ్‌ క్లాసులు ఎప్పటివరకు ఉంటాయి? అంటే జూలై 6 వరకు అని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.

ప్రస్తుతం డెహ్రాడూన్‌లో కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్‌లో మహేశ్‌బాబుతో పాటు పూజా హెగ్డే, కీలక పాత్రధారి ‘అల్లరి’ నరేశ్‌ పాల్గొంటున్నారు. ఈ డెహ్రాడూన్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 6 వరకు జరుగుతుందట. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం మూవీ టీమ్‌ యూఎస్‌ వెళ్తారట. అలాగే ఈ సినిమాలో కాలేజ్‌ సీన్స్‌లో మాస్‌ స్టూడెంట్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటిస్తున్నారని, ఈ చిత్రంలో హీరోయిన్‌ అదితీరావు హైదరీ కీలక పాత్ర చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు