సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇచ్చేసిన మహేష్‌ బాబు

10 Apr, 2018 15:06 IST|Sakshi

గత చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ఈసారి ఎలాగైనా సరే హిట్‌ కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకే ‘భరత్‌ అనే నేను’ ద్వారా దర్శకుడు కొరటాల శివతో కలిసి ‘శ్రీమంతుడు మ్యాజిక్‌’ను రిపీట్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు. మరో పది రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం అవుట్‌ పుట్‌ పట్ల సంతోషంతో ఉన్న మహేష్‌.. యూనిట్‌ సభ్యులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లను ఇచ్చేశాడు. 

భరత్‌ అనే నేను చిత్రం కోసం పని చేసిన టెక్నీషియన్లకు ఐ ఫోన్‌ 10 ను కానుకగా ఇచ్చాడు. నమ్రతా అండ్‌ మహేష్‌ పేరిట ఆ గిఫ్ట్‌లను అందజేశారు. ఇక వాటిని అందుకున్న కొరటాల బృంద సభ్యులు.. తమ శ్రమకు ప్రత్యేక బహుమతులంటూ సంతోషంగా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. పొలిటికల్‌ కమర్షియల్‌ డ్రామాగా తెరెకెక్కిన భరత్‌ అనే నేను చిత్రం ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు