టీజర్ లోడ్ అవుతోందట

16 Nov, 2019 12:53 IST|Sakshi

టాలీవుడ్‌ ‘ప్రిన్స్‌’ మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ త్వరలో విడుదలకానుంది. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హీరో మహేశ్‌బాబు గన్‌ లోడ్‌ చేస్తున్న క్లిప్‌ను షేర్ చేసి ‘టీజర్ లోడ్ అవుతోంది’ అంటూ కామెంట్‌ పెట్టారు. అయితే టీజర్‌ ఏ తేదీన విడుదలవుతుందో ఇంకా వెల్లడించలేదు. వచ్చే వారం టీజర్‌ బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. సరిలేరు నీకెవ్వరు టీజర్‌, మాస్‌ఎంబీ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మహేశ్‌బాబు, విజయశాంతి పోస్టర్లు, ఎంట్రీ సాంగ్‌ టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు. ఈ చిత్రం టీజర్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

వరుస విజయాలతో సక్సెస్‌పుల్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతేడాది సంక్రాంతికి ‘ఎఫ్‌2’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన మహేశ్‌బాబుతోనూ హిట్‌ కొట్టాలని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తోంది. మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడిగా రష్మిక మందాన నటించారు. రాజేంద్రప్రసాద్‌, విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, ఆది పినిశెట్టి, వెన్నెల కిశోర్‌, అనుసూయ భరద్వాజ్‌ తదిరులు ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు