మహేష్‌ ఎన్నడూ చేయని యాక్షన్‌ సీన్స్‌ చేశాడట!

24 Nov, 2018 20:26 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రన్నింగ్‌.. యాక్షన్స్‌ సీన్స్‌కు ఉండే క్రేజే వేరు. పోకిరిలో మహేష్‌ బాబు పరిగెత్తే సీన్స్‌కు థియేటర్స్‌లో విజిల్స్‌ పడ్డాయి. ఇక యాక్షన్స్‌ సీన్స్‌లో మహేష్‌ మ్యానరిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాల్లో ఇన్ని యాక్షన్‌ సీన్స్‌ చేసిన మహేష్‌.. ఒక వాణిజ్య ప్రకటన కోసం కూడా హాలీవుడ్‌ లెవల్‌లో యాక్షన్‌ సీన్స్‌ చేశారు. 

మహేష్‌ బాబు ఇటు సినిమాలతో అటు ప్రకటనలతో ఎప్పుడూ అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. తాజాగా థమ్స్‌ అప్‌ యాడ్‌లో మహేష్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. మహేష్‌ సైతం ఈ యాడ్‌ గురించి సోషల్‌మీడియాలో చెపుతూ.. ఇలాంటి యాక్షన్‌ సీన్స్‌తో నేనెప్పుడు చేయని యాడ్‌..అంటూ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం మహేష్‌ బాబు.. హైదరాబాద్‌లో వేసిన భారీ విలెజ్‌ సెట్‌లో ‘మహర్షి’ షూటింగ్‌లో  బిజీగా ఉన్నాడు. 

One of the most action-packed ads that I’ve ever been a part of. Excited to share with you guys! Enjoy the Chase! #TasteTheThunder @thumsupofficial

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా