నా ఫేవరెట్‌ కో స్టార్‌ ఆమే: మహేష్‌ బాబు

18 Jan, 2020 13:37 IST|Sakshi

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌... ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అదే రోజు రాత్రి.. హన్మకొండలో చిత్రం విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సినిమా విడుదలకు ముందు, తర్వాత తాను పాల్గొన్న మూవీ ప్రమోషన్లలో చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రత్యేమని మహేశ్‌ బాబు పేర్కొన్నారు. ‘‘నా చిట్టితల్లులకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇంతకు మించిన సంతోషం ఏం ఉంటుంది! వాళ్ల ఎనర్జీ, స్టైల్‌ సూపర్‌. వాళ్లిద్దరికీ నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి’’ అని ఇంటర్వ్యూ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

కాగా మహేశ్‌ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్‌ ఎస్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్‌ రష్మిక మందన్నను ఇంటర్వ్యూ చేశారు. ఇక తాజాగా మహేశ్‌ బాబును తమ ఛానెల్‌కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సూపర్‌స్టార్‌ అభిమానుల మనసు దోచుకున్నారు. కాగా ఇంటర్వ్యూలో భాగంగా సితార, ఆద్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్‌ బాబు సమాధానమిచ్చారు. ఈ ఏడాదిలో జనవరి 11 తనకు ప్రత్యేకమైన రోజని... ఆర్మీ జవానుగా నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తన సహనటుల్లో చాలా మంది ఫేవరెట్‌ యాక్టర్లు ఉన్నారని.. అయితే ప్రస్తుతానికి ఫేవరెట్‌ కోస్టార్‌ రష్మిక అని మహేశ్‌ సరదాగా వ్యాఖ్యానించారు.(‘రష్మికను ఓ ఆటాడుకున్న సితార’)

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా