దక్షిణాదిన మహేశ్‌ ఒకే ఒక్కడు

3 Jul, 2020 13:11 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, మోస్ట్‌ హ్యాండ్సమ్‌‌ హీరో మహేశ్‌ బాబుకు ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 40ల్లో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందం విషయంలో మిగతా హీరోల కంటే ఓ మెట్టుపైనే నిలుస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు పిల్లలు తండ్రి అయినప్పటికీ అమ్మాయిల్లో మహేశ్‌కు ఉండే క్రేజ్‌ మాటల్లో వర్ణించలేం. ఇక మహేశ్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారు. ఆయన వ్యక్తిగత, కుటుంబ, సినిమాలకు సంబంధించి అనేక విషయాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితైన మహేశ్ కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేలా, అందరిలో చైతన్యం కలిగించేలా పలు పోస్ట్‌లు చేసి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. (బాధ్యతతో వ్యవహరించండి: మహేశ్‌) 

దీంతో సోషల్‌ మీడియాలో మహేశ్‌ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మహేశ్‌ ఓ అరుదైన ఘనత సాధించారు. ట్విటర్‌లో 10 మిలియన్ల (కోటి) మంది ఫాలోవర్ల ప్రేమను సొంతం చేసుకున్నాడు (అంటే మహేశ్‌ కోటి మంది ఫాలవర్స్‌ను కలిగి ఉన్నాడన్నమాట). దీంతో దక్షిణాదిన కోటి మంది ట్విటర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన హీరోగా మహేశ్‌ పేరిట రికార్డు నమోదైంది. తమిళ స్టార్ హీరో ధనుష్ 9.1 మిలియన్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ 6.1 , నాగార్జున 6 , రానా 6, రజనీకాంత్ 5.7, అల్లు అర్జున్ 4.7, జూనియర్ ఎన్టీఆర్ 4.2, విజయ్ దేవరకొండ 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అయితే మహేశ్‌ను 10 మిలియన్ల మందిని ఫాలో అవుతుండగా అతడు మాత్రం కేవలం 31 మందినే ఫాలో అవుతున్నారు. ఇక ప్రస్తుతం మహేశ్‌ పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  (హీరో మహేశ్‌ బాబు ఉదారత)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా