బాబా సన్నిధిలో మహేశ్‌బాబు

29 Dec, 2019 15:26 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు షిర్టీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి షిర్డీ వెళ్లిన మహేశ్‌.. బాబా ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట దర్శకుడు మెహర్‌ రమేశ్‌ కూడా ఉన్నారు. త్వరలో మహేశ్‌ తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేసిన మహేశ్‌.. వారం రోజుల పాటు ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన షిర్డీ ఆలయానికి వెళ్లారు. 

అలాగే మరో వారం రోజుల తర్వాత మహేవ్‌.. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోతారు. మహేశ్‌బాబు సరసన రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక జరగనుంది. ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌

బ‌న్నీ డ్యాన్స్‌పై బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుమానం