మహేష్‌ కూడా ఇంప్రెస్‌ అయ్యాడు!

19 Jun, 2018 14:22 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం అభిమన్యుడు. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్‌ హిట్ టాక్‌ వచ్చింది. టెక్నాలజీ మూలంగా మనిషి ప్రైవసీకి ఎలా భంగం కలుగుతోంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఎలా వినియోగించుకుంటున్నారు అన్న అంశాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. అందుకే అభిమాన్యుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్‌ అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రంశసల జల్లు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్‌ లో సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. అభిమన్యుడు సినిమా చూసిన మహేష్ దర్శకుడు మిత్రన్‌, హీరో నిర్మాత విశాల్‌పై ప్రశంసలు కురిపించారు. పీఎస్‌ మిత్రన్‌ ఎంతో రిసెర్చ్‌ చేసి సినిమాను రూపొదించారన్న మహేష్, విశాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు