తమన్నా స్టెప్పులేసిన సితార

13 Feb, 2020 21:40 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే. ఈ పసి ప్రాయంలోనే అటు యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్‌ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. తాజాగా మహేశ్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’  సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రంలోని ‘డాంగ్‌ డాంగ్‌’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు సితార వేసింది. డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు. 

కాగా మహేశ్‌ బాబు ముద్దుల తనయ సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్‌ ఎస్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్‌ బాబు, హీరోయిన్‌ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు. ఇక ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్‌ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇదే టూర్‌లో మహేశ్‌ తన మోకాలి శస్త్ర చికి​త్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం స్వదేశానికి తిరిగొచ్చి వంశీ పైడిపల్లి చేయబోయే సినిమాను పట్టాలెక్కించనున్నాడు.   
 

absolutely nailed it💃💃👏👏 #SarileruNeekevvaru

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా