మహేష్ బాబు '1'లో గౌతమ్ కృష్ణ

8 Jul, 2013 14:08 IST|Sakshi
గౌతమ్ కృష్ణతో మహేష్ బాబు

'ప్రిన్స్' మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ '1' నేనొక్కడినే సినిమాతో తెరంగ్రేటం చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలను లండన్ లో జూలై 7న చిత్రీకరించారని ఈ సినిమా ప్రతినిధి ఒకరు ఐఏఎన్ఎస్ తో చెప్పారు.

గౌతమ్ ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ పట్టుబడడంతో  చివరకు అంగీకరించారని వెల్లడించారు. తన కుమారున్ని అప్పుడే సినిమాల్లోకి తీసుకురాకూడని మహేష్ భావిస్తున్నారని చెప్పారు. సినిమాలో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుందని తెలిపారు.

'1' నేనొక్కడినే సినిమా యూరప్ లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.