నమ్రతా హార్ట్‌ టచింగ్‌ మెసేజ్‌... వైరల్‌

5 Jan, 2020 18:34 IST|Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ఫోటో సోషల్‌మీడియాల్‌ వైరల్‌ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని అంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్‌ చేశారు. నమ్రత పోస్ట్‌ చేసిన ఆ ఉద్వేగభరిత పోస్ట్‌ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్‌, గౌతమ్‌లు ఒకే విధంగా, ఒకేరకమైన క్యాస్టూమ్స్‌ అందంగా అంతకుమించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు ‘వీరే నా సూపర్‌ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది’అంటూ నమ్రతా హార్ట్‌ టచింగ్‌ మెసేజ్‌ పోస్ట్‌ చేశారు.

ఇక మహేశ్‌ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇక ‘మహర్షి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ విజయం తర్వాత మహేశ్‌ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. ఇక దాదాపు దశాబ్దం తర్వాత విజయశాంతి సినిమాల్లోకి ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, సంగీత, కౌముది, రఘుబాబు, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 
 

My 3 super heroes ❤️❤️❤️life has come a full circle ⭕️ #gratitude for what these men do for me !! Greatful for these men who bring me each time a different learning 🤗🤗blessed to have them as my pillars of strength🙏🙏

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం

కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

సినిమా

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం

కరోనా వైరస్‌ ; నటుడిపై దాడి

కథలు వండుతున్నారు

దారి చూపే పాట

ఆర్‌ఆర్‌ఆర్‌లో..?