అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని!.. వైరల్

10 Dec, 2017 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అధికారిక సమావేశాలకు వెళ్లిన తాను ప్రాణాలతో బయటపడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఓ మహిళా కార్యకర్త తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై సినీ విమర్శకుడు, నటుడు మహేశ్ కత్తి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్.. మీలాంటి సామాన్య మహిళలకు రక్షణ కల్పిస్తారని ఎలా అనుకున్నారంటూ జనసేన అధిసేన అధినేత తీరును మరోసారి తప్పుపట్టారు.

'ఇద్దరు పిల్లల తల్లి. ఒక దశాబ్దం పాటు కలిసి బ్రతికిన రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ నుంచీ బెదిరింపులు వస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ లోకి వచ్చే మహిళలకు రక్షణ ఇస్తాడని ఎలా అనుకున్నారు తల్లీ మీరు? పవన్ కళ్యాణ్ పిచ్చి సేనకు దక్కిన తిక్క సేనాని. అక్కడ ఫ్యాన్స్ అనే భక్తుల మాటలే చెల్లుతాయి. మీకు దక్కేవి అవమానాలు, ప్రాణ భయాలే. మహిళల్లారా... తల్లులారా జనసేనకు దూరంగా ఉండండి. అదొక ఉన్మాదపు సేన. అతనో తిక్క సేనాని. మీ జాగ్రత్తలో మీరు ఉండండి' అంటూ మహేశ్ కత్తి పిలుపునిచ్చారు.

జనసేనలో మహిళలకు రక్షణ లేదు!
ఆ వీడియోలో ఏముందంటే.. నాపేరు విజయలక్ష్మి. పవన్ కల్యాణ్ ఒంగోలు సభకు వెళ్లాను. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. సమస్యను జనసేన అధికార ప్రతినిధులకు చెబితే.. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ మహిళను ప్రశ్నించడం బాధాకరం. మహిళల ప్రాణాలకు పవన్ సభలో రక్షణ లేదు. మేం ప్రాణాలు కోల్పోతే పవన్‌కు ఏ నష్టం లేదు. నష్టపోయేది మా కుటుంబాలే. మహిళలకు జనసేన పార్టీ నేతలే విలువివ్వకపోవడం దురదృష్టకరం. పవన్ కల్యాణ్ ఎక్కడో ఏసీ కార్లలో తిరుగుతారు. మాలాంటి మహిళా కార్యకర్తల బాధలు పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయంటూ' భయానక పరిస్థితిని జనసేన మహిళా కార్యకర్త వీడియో ద్వారా వెల్లడించగా.. ఆ వీడియోను మహేశ్ కత్తి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది.

మహిళా కార్యకర్తల బాధలు పవన్‌ కల్యాణ్‌కు ఏం తెలుస్తాయి 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా