రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం : మహేశ్‌ కత్తి

10 Jan, 2018 13:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ అంచనాల నడుమ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా బుధవారం విడుదలైంది. తొలిఆట నుంచే సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో పవన్‌ సినిమాపై క్రిటిక్‌ మహేశ్‌ కత్తి.. ఏం రివ్యూ ఇస్తారనేదానిపై ఆసక్తినెలకొంది. ఆమేరకు కత్తి రివ్యూ రాసిన వెంటనే అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

కత్తి ఏమన్నారంటే..: ‘‘ సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా. రిస్క్ చేసి చూస్తే...టైమెమో... మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో)’’
 

సాధారణంగా సాధ్యమైనన్ని ఎక్కువ కోణాల్లో సినిమాలను విశ్లేషించే కత్తి మహేశ్‌.. ‘అజ్ఞాతవాసి’ విషయంలో మాత్రం రెండుముక్కల్లో పనికానిచ్చేశారు.  ఇది ఓ ఫ్రెంచ్‌ సినిమాకు కాపీ అనే విషయంలోనూ గతంలో మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఫ్రెంచ్‌ సినిమా ‘లార్గో వించ్‌’  దర్శకుడు జెరోమ్‌ సలే.. ‘అజ్ఞాతవాసి’ని చూసి.. ‘నా సినిమాను పోలి ఉంద’ని  ట్వీట్‌ చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు