శ్రీవారిని దర్శించుకున్న మహేష్‌ అండ్‌ టీమ్‌..

17 Jan, 2020 08:57 IST|Sakshi

సాక్షి, తిరుపతి : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై కలెక్షన్‌ల వర్షం కురుపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం మహేష్‌ చిత్ర బృందంతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నవారిలో మహేష్‌, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ సుంకర, వంశీ పైడిపల్లి, ఆది శేషగిరిరావు ఉన్నారు.  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికీ ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రే సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ చిత్రం విజయోత్సవ సభ శుక్రవారం సాయంత్రం హన్మకొండలోని జేఎన్‌ఎస్‌లో జరగనుంది. ఇందుకోసం శ్రేయాస్‌ మీడియా భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా