రెండో యాత్రకు శ్రీకారం

30 May, 2019 00:07 IST|Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్‌  రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్‌కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్‌. ‘‘వై.ఎస్‌. రాజారెడ్డి (వైఎస్సార్‌ తండ్రి), వై.ఎస్‌. జగన్‌ పాత్రలు లేకుండా వైఎస్సార్‌గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్‌. జగన్‌గారి విజువల్స్‌తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్‌ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు మహి.వి. రాఘవ్‌.

మరిన్ని వార్తలు