ఔను.. నాకు మూడేళ్ల కూతురుంది: హీరోయిన్‌

3 Jul, 2019 09:17 IST|Sakshi

2008లో వచ్చిన సూపర్‌హిట్‌ సినిమా ‘దేవ్‌ డీ’లో హీరోయిన్‌గా నటించిన మహీ గిల్‌ గుర్తుందా? ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి ప్రతిభ గల నటిగా మహీ పేరు తెచ్చుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు నోరు మెదపని ఈ అమ్మడు.. తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తనకు మూడేళ్ల కూతురు ఉందని వెల్లడించారు. తన కూతురి వివరాలు తెలిపారు. నవభారత్‌ టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహీ గిల్.. ‘ఒక బిడ్డగా తల్లిగా ఉండటం ఎంతో గర్వంగా ఉంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసుకుంటాను. ఈ ఏడాది ఆగస్టు నెలకు నా కూతురికి మూడేళ్లు వస్తాయి’ అని తెలిపారు. గతంలో మీకు కూతురు ఉన్న సంగతి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. ఆ ప్రశ్న అడగలేదని, అందుకే తాను చెప్పలేదని పేర్కొన్నారు. 

మరి, పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా.. ‘పెళ్లి అవసరం ఏముంది? ఇదంతా మన ఆలోచనాధోరణిపైనే ఆధారపడి ఉంటుంది. పెళ్లి లేకపోయినా.. పిల్లలు, కుటుంబాన్ని కలిగి ఉండవచ్చు. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదొక సమస్య అని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక జీవితం ఉంటుంది. కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. పెళ్లి అనేది అందమైనదే. కానీ పెళ్లి చేసుకోవడమనేది పర్సనల్‌ చాయిస్‌’ అని మహీ గిల్‌ చెప్పుకొచ్చారు. ‘దేవ్‌ డీ’ సినిమా తర్వాత ‘సాహిబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌’సిరీస్‌ సినిమాలతో మహీ గిల్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా