అప్పుడు 70 ఇప్పుడు 90

18 Oct, 2019 00:46 IST|Sakshi
కమల్‌హాసన్‌

శంకర్‌–కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సినిమా ‘ఇండియన్‌’ (తెలుగులో భారతీయుడు). ఆ సినిమాలో కమల్‌ యువకుడిగా, వృద్ధుడిగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో 70 ఏళ్ల వృద్ధుడిలా నటించారు కమల్‌. అప్పుడు 41 ఏళ్ల వయసులో ఉన్న కమల్‌ హాలీవుడ్‌ స్థాయి మేకప్, తన నటనతో ప్రేక్షకులను తాను నిజంగానే 70 ఏళ్ళ వృద్ధుడు అన్నట్లు నమ్మించారు.

23 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్‌ వయసు 64. రెండో భాగంలో ఆయన 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తారట. యాక్షన్‌ సీన్స్‌ను కూడా అందుకు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారట ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, రకుల్, సిద్ధార్థ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు