ఏకాభిప్రాయం కుదిరేనా?

27 Apr, 2018 00:31 IST|Sakshi

వేతనాల పెంపు, హాఫ్‌ కాల్షీట్‌ రద్దు వంటి తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లైట్స్‌మన్‌ స్ట్రైక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో లైట్స్‌మన్‌ యూనియన్‌ చర్చలు జరిపింది. కానీ, చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధర్నా చేసేందుకు గురువారం ఫిల్మ్‌ చాంబర్‌కు వెళ్లింది లైట్స్‌మన్‌ యూనియన్‌.

గురువారం సాయంత్రం యూనియన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ ‘సాక్షి’ తో మాట్లాడుతూ– ‘‘24 యూనియన్స్‌లో 23 యూనియన్స్‌కు అగ్రిమెంట్స్‌ అయ్యాయని తెలిసింది. మాకు అగ్రిమెంట్‌ పేపర్స్‌ వచ్చాయని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ధర్నాను నిలిపివేశాం. మరోసారి చర్చలు జరపనున్నాం.  ఈ సమావేశంలోని నిర్ణయాలు మాకు సానుకూలంగా రాకపోతే బంద్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. పూర్తి వివరాలు అగ్రిమెంట్స్‌ కంప్లీట్‌ అయిన తర్వాత తెలియజేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు