విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

3 Apr, 2020 11:22 IST|Sakshi

అర్భాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకునే సమయంలో తాను కఠిన పరిస్థితులను ఎదుర్కోన్నానని బాలీవుడ్‌ నటి మలైకా అరోరా చెప్పారు. ఇటీవల కరీనా కపూర్‌ టాక్‌ షోకు అతిథిగా వచ్చిన ఆమె తన విడాకుల విషయంపై మాట్లాడుతూ.. ‘నేను విడాకులు తీసుకోవడం సరైనది కాదని ప్రతి ఒక్కరూ హెచ్చరించేవారు. అలాగే నీ నిర్ణయానికి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి నువ్వు విడాకులు తీసుకోకపోవడమే మంచిది అని సూచించేవారు. విడాకులు తీసుకోవడానికి ముందు రోజు రాత్రి కూడా నా కుటుంబ సభ్యులు సైతం ‘నువ్వు డైవర్స్‌కు సిద్ధంగానే ఉన్నావా?’ అని అడిగారు’ అంటూ చెప్పుకొచ్చారు. (కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్‌ ఖాన్‌)

‘‘మనం తీసుకోనే ఓ నిర్ణయం మన జీవితాన్ని సులభంగా సాగిపోనివ్వదు. చివరికి కొంతమందితో నిందలు పడాల్సినా పరిస్థితులను తీసుకువస్తుంది. అయితే మన కోసం మనచూట్టూ ఉండేవారి కోసం ఇది సరైనదని భావించే నేను, అర్భాజ్‌ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు. అలాగే తన కుమారుడు అర్హాన్‌ ఎలా మీ ఈ నిర్ణయాన్ని అంగీకరించాడని అడగ్గా.. ‘‘ఏ తల్లైనా తన పిల్లలకు సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటుంది. తన ముందున్న పరిస్థితుల వల్ల ఆ సమయంలో అర్హాన్‌ కూడా నన్ను సమర్ధించాడు. ఓ రోజు అర్హాన్‌ నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఎలా అనందంగా ఉంటావో అదే చేయి.. ఎందుకంటే నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను’’ అని చెప్పాడని గుర్తు చేసుకున్నారు.

కాగా మలైకా అరోరా, అర్భజ్‌ ఖాన్‌లు 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరి వైవివాహిక బంధంలో అభిప్రాయ భేధాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. బద్రాలోని ఫ్యామిలీ కోర్టులో  2017 మేలో ఈ వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినట్లు అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మలైకా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉండగా.. అర్భాజ్‌ ఇటాలియన్‌ మోడల్‌ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా