రేసింగ్‌ హీరో!

4 Mar, 2019 03:34 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

బైక్‌ రేసర్‌గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారట విజయ్‌ దేవరకొండ.  బైక్‌ రైడింగ్‌ కోసం ఆల్రెyీ  స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా స్టార్ట్‌ చేశారట విజయ్‌. ఈ సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆనంద్‌ అన్నామలై దర్శకత్వం వహించనున్నారు. తమిళం చిత్రం ‘కాకముటై్ట’కు డైలాగ్‌ రైటర్‌గా పని చేశారట ఆనంద్‌. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మాళవిక మోహనన్‌ కనిపిస్తారని టాక్‌. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్‌ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మించబోతుందని టాక్‌. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ మూవీలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్‌నే హీరోగా నటిస్తున్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో కెరీర్‌లో టాప్‌గేర్‌ వేశారు విజయ్‌.

మరిన్ని వార్తలు