మళ్లీ జోడీ?

21 Mar, 2020 05:58 IST|Sakshi
మాళవికా శర్మ, రవితేజ

‘నేల టిక్కెట్టు’ సినిమాలో జంటగా నటించిన రవితేజ–మాళవికా శర్మ మరోసారి కలిసి నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘క్రాక్‌’ చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత రవితేజ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు రవితేజ. హవీశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారట. దీంతో ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకి అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ను తీసుకున్న చిత్రబృందం మరో హీరోయిన్‌గా మాళవికా శర్మను తీసుకోనున్నారని టాక్‌. ఇదే నిజమైతే రవితేజ–మాళవికలను రెండోసారి జోడీగా చూడొచ్చన్న మాట. 

మరిన్ని వార్తలు