వ్యాపారవేత్తను పెళ్లాడనున్న నటి

3 Jun, 2020 19:38 IST|Sakshi

తిరువనంతపురం: లాక్‌డౌన్‌ వేళ మలయాళ నటి మియా జార్జ్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసి తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని వెల్లడించారు. కాగా వ్యాపారవేత్త అశ్విన్‌ ఫిలిప్‌తో మియాకు మంగళవారం ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో కేరళలోని ఫిలిప్‌ నివాసంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను మియా సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేయడంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమను విష్‌ చేసిన వారికి మియా కృతజ్ఞతలు తెలిపారు.(పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్‌ సిరీస్‌లో..)

కాగా మియా- ఫిలిప్‌ల వివాహం సెప్టెంబరులో జరుగనున్నట్లు సమాచారం. ఇక టీవీ నటిగా కెరీర్‌ ఆరంభించిన మియా జార్జ్‌.. ఈ అడుత కలాతు, డాక్టర్‌ లవ్‌ వంటి మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అమర కావ్యం అనే రొమాంటిక్‌ డ్రామాతో 2014లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. రెడ్‌ వైన్‌, మెమరీస్‌, విషుధన్‌, మిస్టర్‌ ఫ్రాడ్‌ వంటి చిత్రాల్లో నటించారు. ఇక చియాన్‌ విక్రమ్‌ ‘కోబ్రా’ సినిమాలో ప్రస్తుతం మియా నటిస్తున్నారు. అదే విధంగా కన్మణిల్ల అనే మరో మలయాళ చిత్రం ఆమె చేతిలో ఉంది.(YOLO అంటోన్న సోనూసూద్‌)

Thanks for all the Love & prayers ❤ Costume designed by @labelmdesigners @anureshma_

A post shared by miya (@meet_miya) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా