'ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ'

30 Dec, 2015 20:04 IST|Sakshi
'ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ'

90లలో సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సష్టించిన శృంగార తార షకీలా ఇండస్ట్రీలోని పరిస్థితులపై నోరు విప్పింది. స్టార్ హీరోలు కూడా వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సమయంలో కూడా తన సినిమాలతో మంచి వసూళ్లను రాబట్టిన షకీలా ఆ తరువాత తన సినిమాల హవా తగ్గటం పై స్పందించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా గ్లామర్ పాళ్లు బాగానే ఉన్నప్పటికీ తన సినిమాలనే అశ్లీల చిత్రాలుగా చూపించారని, ముఖ్యంగా కేరళ ఇండస్ట్రీలో స్త్రీలకు సరైన గౌరవం లేకపోవటం, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కావటం మూలంగానే ఇలా జరిగిందని తెలిపింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయన్న షకీలా,  ఈ తరం హీరోయిన్లు తెలివిగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగకపోయినా ఉన్నంతలో మంచి ఫేమ్ తో పాటు డబ్బు సంపాదించుకొని తరువాత ఫ్యామిలీతో సెటిల్ అయిపోతున్నారని, ఇది చాలా మంచి పరిణామమంటోంది. వ్యక్తిగతంగా కూడా తన జీవితంలో ఎంతో నష్టపోయానని, తన మేనేజర్ తో పాటు సొంత వారు కూడా తన డబ్బు తీసుకొని తనను మోసం చేశారని తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి