టీజర్‌  ఫ్రెష్‌గా  ఉంది – డి. సురేశ్‌బాబు

23 Jan, 2019 01:17 IST|Sakshi

‘‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ చిత్రకథాంశం యువతకు బాగా చేరువయ్యేలా ఉంది. అనురాగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అనురాగ్‌ కొణిదెన హీరోగా, శ్వేతా అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా సాయిదేవ రామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సురేశ్‌బాబు విడుదల చేశారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మేం అనుకున్న దానికంటే ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా బాగా వచ్చింది.

మా చిత్రకథ నచ్చి టీజర్‌ విడుదల చేసిన సురేశ్‌బాబుగారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ మా ‘మళ్లీ మళ్లీ చూశా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు సాయిదేవ రామన్‌. ‘‘కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాతో హీరోగా పరిచయమవడం హ్యాపీ’’ అన్నారు అనురాగ్‌. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్, కెమెరా: సతీష్‌ ముత్యాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాయి సతీష్‌ పాలకుర్తి. 

మరిన్ని వార్తలు