రాణి మల్లికా

8 Feb, 2020 05:22 IST|Sakshi
మల్లికా శెరావత్‌

హాట్‌ గర్ల్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న మల్లికా శెరావత్‌ ఇప్పుడేం చేస్తున్నారు? అంటే కెరీర్‌పరంగా జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ‘భూ సబ్‌కీ ఫతేగీ’ అనే వెబ్‌ సిరీస్‌ మాత్రమే చేస్తున్నారామె. ఇప్పుడు ఆమెకు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. తమిళ చిత్రం ‘పాంబాట్టన్‌’లో రాణి పాత్ర చేసే అవకాశం దక్కింది. చిత్రదర్శకుడు వడివుడయాన్‌ ఇటీవల ముంబై వెళ్లి మల్లికాకు కథ కూడా వినిపించారు. ‘‘కథ విన్న వెంటనే ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. ఇందులో రాణి పాత్ర కీలకం. సినిమా మొత్తం ఈ పాత్ర ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు.

గతంలో తమిళంలో కమల్‌హాసన్‌ నటించిన ‘దశావతారం’ (2008)లో మల్లికా ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత ‘దబాంగ్‌’ రీమేక్‌ ‘ఓస్తీ’ (2011)లో ఐటమ్‌ సాంగ్‌ చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తమిళంలో ఆమె నటించబోతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో ఆమె ఫైట్స్‌ కూడా చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెలాఖరున మల్లికా పాత్ర చిత్రీకరణ మొదలవుతుంది. విశేషం ఏంటంటే.. ఈ  చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు