యుద్ధానికి సై

9 Jun, 2019 03:51 IST|Sakshi
మమ్ముట్టి

మలయాళ నటుడు మమ్ముట్టి తన కొత్త చిత్రం కోసం యోధుడిలా మారిపోయారు. ఆయన హీరోగా పద్మకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మమంగం’. పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి నిర్మిస్తున్నారు. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘యుద్ధానికి సిద్ధం’ అన్నట్టు మమ్ముట్టి ఫోజుని గమనించవచ్చు. ‘ఈ ఫస్ట్‌లుక్‌ని సాధారణంగా ఫొటోషూట్‌ జరిపినట్టు కాకుండా యాక్టర్స్‌ అందరూ ఆ సన్నివేశాన్ని నటిస్తుంటే ఈ ఫొటోలను తీసి ఫస్ట్‌లుక్‌గా రిలీజ్‌ చేశాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది.

మరిన్ని వార్తలు