18 మెట్లు

27 Mar, 2019 00:27 IST|Sakshi
మమ్ముట్టి

నాలుగు దశాబ్దాల కెరీర్‌లో దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పుడు 18 మెట్లు ఎక్కబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘పదునెట్టామ్‌ పడి’. అంటే.. 18 మెట్లు అని అర్థం. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జాన్‌ అబ్రహాం పాలక్కల్‌ అనే ప్రొఫెసర్‌ పాత్ర చేస్తున్నారు. స్టైలిష్‌ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారాయన. శంకర్‌ రామకృష్ణన్‌ దర్శకుడు. ఈ చిత్రంలో మమ్ముట్టి లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆయనది సినిమాకి కీలకంగా నిలిచే అతిథి పాత్ర అని సమాచారం. పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు