మౌన ప్రేమ

30 Dec, 2018 04:45 IST|Sakshi
ప్రియ, నందు

రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్‌ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే ఫ్రెష్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న చిత్రం ‘మనసు పలికే మౌన ప్రేమ’. నందు, ప్రియ, బాబా కల్లూరి, మేరిగ వీరబాబు, అజిత్‌ బాబు ముఖ్య తారలుగా బాబీ వేంపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఏఎస్‌పీ ప్రొడక్షన్స్‌ పతాకంపై బొట్రేపల్లి ఆవులకుంట్ల సూర్యప్రకాశ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి  తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్‌ ఇవ్వగా, కె.ఎస్‌. నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ– ‘‘1980లో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది.

ఈ సినిమాకి కథ నేనే అందించా. స్టోరీ చెప్పినప్పుడు నా స్నేహితుడు బాబీ ఎగ్జయిట్‌ అయ్యి దర్శకత్వ బాధ్యత తీసుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. జనవరి 18న రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభించి, మూడు నెలల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘ఫ్రెష్‌ లవ్‌ స్టోరీతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సూర్యగారు స్టోరీ బాగా రాశారు. నాపై తను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను’’ అన్నారు బాబీ. ‘‘టైటిల్‌ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది’’ అని హీరో నందు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కుమారన్‌.

మరిన్ని వార్తలు