టీజర్‌ చూస్తే క్వాలిటీ తెలుస్తోంది

24 Nov, 2018 00:14 IST|Sakshi
బాల, మారుతి, రామ్‌ కార్తీక్‌

మారుతి

‘‘మంచు కురిసే వేళలో’ సినిమా టీజర్‌ చాలా బాగుంది. మనసుని హత్తుకునే చక్కటి సంగీతం కూడా ఉంది. ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మంచి ఔట్‌డోర్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. టీజర్‌ చూస్తే సినిమా క్వాలిటీ తెలుస్తోంది. రామ్‌ కార్తీక్‌ చాలా అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. రామ్‌ కార్తీక్, ప్రనాలి జంటగా ప్రణతి ప్రొడక్షన్‌ పతాకంపై బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’.

ఈ సినిమా టీజర్‌ను మారుతి విడుదల చేశారు. దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘అందమైన కథ, కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. రామ్‌ కార్తీక్‌ కెరీర్‌లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఆడియో, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్‌ కుమార్‌ పంగులూరి.

మరిన్ని వార్తలు