నోరు నొక్కేయకండి!

28 Oct, 2018 02:28 IST|Sakshi
లక్ష్మీ మంచు

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ‘మీటూ’ ఉద్యమంపై చాలా మంది నటీనటులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా నిర్మాత, నటి లక్ష్మీ మంచు  స్పందించారు. ‘‘ప్రపంచంలో మహిళల పట్ల దారుణాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఇండియా రెండోదో మూడోదో కావడం బాధాకరం. మన దగ్గర మహిళలకు భద్రత తక్కువగా ఉందనే భావన కలుగుతోంది. మహిళలు ముందుకొచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు గురించి చెప్పినప్పుడు వినాలి. లేని పోని ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టకూడదు.

ఆల్రెడీ నిజం చెప్పడం కోసం బాధపడుతూనే ఉన్నారు. ప్రతి మహిళ తన జీవితంలో వేధింపులకు గురవుతుంది. పబ్లిక్‌ ప్లేసెస్‌కి వెళ్లినప్పుడు ఇవి ఎక్కువ. ఓ ఆకతాయి నన్ను అభ్యంతరకరంగా తాకాడు. ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలను చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మహిళలు అక్కడే ప్రశ్నిస్తున్నారు. వారి నోరును నొక్కేయకండి. అలాగని అన్ని సందర్భాల్లో పురుషులదే తప్పు అని చెప్పడంలో లేదు. ఇద్దరి వైపు నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘మీటూ’ ఉద్యమం గురించి పరుషులు పాజిటివ్‌గా ఆలోచించాలి. అలా చేస్తే వారే మీటూ ఉద్యమంలో చాంపియన్స్‌’’ అన్నారు లక్ష్మీ మంచు.

మరిన్ని వార్తలు