మీరు నిజంగా వన్‌ మ్యాన్‌ ఆర్మీ

19 Mar, 2020 09:15 IST|Sakshi

కలెక్షన్‌, డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబుకు ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..  ‘‘ మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్‌ మ్యాన్‌ ఆర్మీ! లవ్‌ యూ టు ది మూన్‌ అండ్‌ బ్యాక్‌(ఎదుటి వ్యక్తిపై గల ఎనలేని ప్రేమను తెలియజేయటం కోసం ‘ లవ్‌ యూ టు ది మూన్‌ అండ్‌ బ్యాక్‌ ’ ను వాడతారు)’ అని అన్నారు. 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆయనకు పలువరు సీని, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ( అందరూ బాగుండాలని... )
 

ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్‌బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!’ అని అన్నారు.
 

కాగా, మోహన్‌ బాబు తన 70వ పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు  విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో కొద్ది రోజుల క్రితం ఓ లేఖను విడుదల చేశారాయన. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ( ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్‌బాబు )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు