ఫ్యాషన్ డిజైనర్పై మంచు లక్ష్మీ ఫైర్

2 Apr, 2017 10:47 IST|Sakshi
ఫ్యాషన్ డిజైనర్పై మంచు లక్ష్మీ ఫైర్

సీనియర్ దర్శకుడు వంశీ, లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్గా ఫ్యాషన్ డిజైనర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ఓ డిజైనర్., అమ్మాయి కొలతలు తీసుకుంటున్నట్టుగా ఉన్న ఈ ప్రీ లుక్ పోస్టర్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.

నిర్మాత మధుర శ్రీధర్, 'వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్కు సీక్వల్గా తెరకెక్కుతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ప్రీ లుక్ ఇదే.. ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలోనే రిలీజ్ అవుతుంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ప్రీ లుక్పై స్పందించిన మంచు లక్ష్మీ ' మనం అమ్మాయిలను ఇలా చూపించడం ఎప్పుడు మానేస్తాం' అంటూ కామెంట్ చేసింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచు లక్ష్మీకి మద్ధతు తెలిపింది.

వెంటనే స్పందించిన మధుర శ్రీధర్ మంచు లక్ష్మీకి సమాధానం ఇచ్చాడు. 'మేము ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పోస్టర్ను రిలీజ్ చేయలేదు. సినిమాలోని ఒక సన్నివేశం నుంచి ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేశాం.' అంటూ ట్వీట్ చేశారు. అయితే మంచు లక్ష్మీ ట్వీట్పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జుమ్మందినాథం, గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో తాప్సీని బొల్డ్గా చూపించినప్పుడు స్పందించని లక్ష్మీ, ఇప్పుడు ఈ పోస్టర్ను తప్పు పడ్డటం ఏంటీ..? అన్న వాదన వినిపిస్తోంది.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా