నాకు తెలుసు నాని.. యూ విల్‌ కిల్‌ ఇట్‌

19 May, 2018 11:30 IST|Sakshi

తెలుగు రియాలిటీ షో ‘బిగ్ బాస్’  మంచి విజయాన్ని అందుకుంది. సీజన్‌-1కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో బిగ్‌బాస్‌-2 మన ముందుకు రానుంది. కానీ, ప్రస్తుతం ఈ షో హోస్ట్‌ ఎన్టీఆర్‌ కాదు.. ఈ సారి నాచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఎన్టీఆర్‌ సినిమాలతో బిజీగా ఉండటంతో హోస్ట్‌గా నానిని సెలక్టు చేసి అఫీషియల్‌గా ప్రకటన కూడా చేశారు.

తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని.. ‘బిగ్‌బాస్‌-2’  హోస్ట్‌గాను కూడా అలరిస్తాడనే టాక్‌ వినిపిస్తోంది.  దీనిపై మంచు లక్ష్మీ తన ట్వీటర్‌ అకౌంట్‌లో స్పందించారు. అంతేకాక నానికి ఆల్‌ ​ది బెస్ట్‌ చెప్పింది. ‘వాహ్‌.. చాలా మంచి ప్రకటన. నానిని హోస్ట్‌గా ప్రకటించడం సంతోషం. నాకు తెలుసు.. నాని నువ్వు సూపర్‌. యూ విల్‌ కిల్‌ ఇట్‌.. ఆల్‌ ది బెస్ట్‌. అని తన ట్వీటర్‌ అకౌంట్‌ పేర్కొన్నారు.

మొదటి సీజన్‌ సెట్‌ను ముంబైలోని లోనావాలా దగ్గరాల్లో ఓ అడవిలో వేశారు. అయితే సీజన్‌ 2 సెట్‌ లోకల్‌లోనే ఉంటుంది. నగరం నడిబొడ్డున అన్నమాట. ఫస్ట్‌ సీజన్‌కి ముంబై వేదిక అయితే, సెకండ్‌ సీజన్‌ వేదిక హైదరాబాద్‌. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్‌ తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్‌ కళ్లు చెదిరేలా ఉంటుందని సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌