‘సెంటర్‌ని నమ్ముకుంటే...’

13 Mar, 2018 11:05 IST|Sakshi
మంచు మనోజ్‌

ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ రంగం నుంచి కూడా మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే యంగ్ నిఖిల్‌, దర్శకుడు కొరటాల శివ వంటి వారు హోదా కోసం తమ గళం వినిపించగా బీవీయస్‌ రవి, కొనవెంకట్‌లు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో యంగ్ హీరో మంచు మనోజ్‌ కూడా చేరిపోయాడు. తాజాగా ట్వీటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఘాటుగా స్పందించాడు మనోజ్‌.

మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించిన విషయం గుర్తు చేసిన ఓ అభిమానికి సమాధానంగా ‘మనకు స్పెషల్‌ స్టేటస్‌ కూడా ఇస్తా అన్నారు. చిప్ప తప్ప ఏమీ మిగల్లా. సెంటర్‌ ని నమ్ముకుంటే సంకనాకి పోతాం.’ అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీని నమ్మాలన్న ప్రశ్నకు సమాధానంగా నిన్ను నువ్వు నమ్ముకోవటం బెస్ట్‌ అని సమాధానమిచ్చారు. స్టేటస్‌ అయినా, ప్యాకేజ్‌ అయిన ఇవ్వాల్సింది సెంటర్‌ కదా ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్నకు బదులుగా ‘దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టేవరకు మనకి ఈ బానిస బతుకులు తప్పవ్‌’ అంటూ విమర్శించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

సినిమా

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌

కరోనా విరాళం

కూతురి కోసం...

తమ్మారెడ్డి భరద్వాజకు మాతృ వియోగం

శ్రీలక్ష్మి కనకాల ఇకలేరు