యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

11 Mar, 2017 13:27 IST|Sakshi
యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది

అలియాస్ జానకి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. గోపాల గోపాల, మనమంతా లాంటి సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చినా.. బ్రేక్ మాత్రం రాలేదు. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ సరసన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవటం కూడా ఈ ముద్దుగుమ్మను తీవ్రంగా నిరాశపరిచింది.

తాజాగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు సినిమాలో చేస్తున్న పాత్ర మీదే ఆశపెట్టుకుంది ఈ బ్యూటి. అజయ్ ఆండ్రూ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్గా నటిస్తోంది. మనోజ్ ద్విపాత్రాబినయం చేస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అనీషాను తీసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

 

Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!