ఎల్.టి.టి.ఈ నేపథ్యంలో 'ఒక్కడు మిగిలాడు'

29 Apr, 2017 17:05 IST|Sakshi
ఎల్.టి.టి.ఈ నేపథ్యంలో 'ఒక్కడు మిగిలాడు'

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్, న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఆదివారంతో పూర్తవుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

అనీషా ఆంబ్రోస్ పాత్ర గురించి దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి మాట్లాడుతూ.. 'అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ గా మంచి పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఒక నటిగా అనీషాకు మంచి పేరు తెచ్చిపెడుతుంద' న్నారు.

చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్లు మాట్లాడుతూ.. 'ఇటీవల విడుదలైన మంచు మనోజ్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ను కూడా విడుదల చేయనున్నాం. రేపటితో హైద్రాబాద్లో గత కొన్ని రోజులుగా షూట్ చేస్తున్న లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం' అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా