భావోద్వేగమైన లేఖను పోస్ట్‌ చేసిన మంచు మనోజ్‌

21 Oct, 2018 18:00 IST|Sakshi

హీరోగానే కాకుండా, సహాయ పాత్రల్లో కూడా నటిస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. గత కొంతకాలంపాటు సరైన విజయం లేక ఈ యువ హీరో వెనుకబడ్డాడు. అయితే సినిమాలే ప్రపంచం కాదంటూ.. తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. 

తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని చెబుతూ.. ఓ సుదీర్ఘమైన లేఖను ట్వీట్‌ చేశాడు. మంచు మనోజ్‌ షేర్‌ చేసిన లేఖ..

మరిన్ని వార్తలు