ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..?

15 Apr, 2017 10:29 IST|Sakshi
ధనుష్ సినిమా రీమేక్లో మోహన్ బాబు..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా పవర్ పాండి. సీనియర్ నటులు రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ధనుష్ అతిథి పాత్రలో అలరించాడు.  ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ను విశ్లేకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమా టాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనుష్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైన మోహన్ బాబు తెలుగులో పవర్ పాండీ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన సొంతం బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజ్ కిరణ్ పాత్రలో తానే నటించాలని భావిస్తున్నాడట. అయితే ధనుష్ కనిపించిన అతిథి పాత్రలో మంచు హీరోలే కనిపిస్తారా.. లేక మరో హీరోతో చేయిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.